calender_icon.png 13 August, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

11-08-2025 12:43:46 AM

  1. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరంగా పోరాడాలి...

పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపు...

ఆదిలాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని బీజేపీ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన సాత్నాల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మండల నాయకులు ఎమ్మెల్యేలు శాలువాతో సత్కరించారు. అనంతరం పలువురు బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకే నూతన మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం పాటుపడలన్నారు. జిల్లా ప్రజలు ఎంపీని,  నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ను ఆశీర్వదించిన విధంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ బలపర్చే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.