calender_icon.png 14 August, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ దుర్గాదేవి ఆలయ నూతన అధ్యక్షుడిగా అమందు విజయ్‌కృష్ణ నియామకం

11-08-2025 12:43:56 AM

నిజామాబాద్, ఆగస్టు 10  (విజయ క్రాంతి): నిజామాబాదు నగరంలోని గుమస్తా కాలనీలో శ్రీ దుర్గాదేవి ఆలయ సర్వసభ్య సమావేవిశం జరిగింది. ఈ సమావేశం  జె. మల్లేష్ యాదవ్, ఆకుల సందీప్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నరు.

అధ్యక్షులు: అమందు విజయ్ కృష్ణ ఉపాధ్యక్షులు గా  సంతోష్, అనిల్ కుమార్, కిషన్ ప్రధాన కార్యదర్శి బోడికే బాబురావు కార్యదర్శి గా, రాజేష్, వెంకటేష్,కోశాధికారి: దాత్రిక వేణుగోపాల్, లవంగ సదశివ్ గౌరవ సలహాదారులు, రాజేందర్, భీమన్నా కార్యవర్గ సభ్యులు: దానాజీ, దుబ్బయ్య, సంతోష్, ఉషన్న,శ్రీనివాస్, రామకృష్ణ, ప్రవీణ్,నియమించినట్టు మల్లేష్ యాదవ్, సందీప్ తెలిపారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ..‘నాపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని అప్పగించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. అమ్మవారి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. అందరితో కలసి అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాను‘ అని అన్నారు. కార్యక్రమంలో గుమస్తా కాలోని సభ్యులు స్థానికులు పాల్గొన్నారు