calender_icon.png 16 December, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలి

10-12-2025 12:35:59 AM

డీఎస్పీ అబ్దుల్ రహమాన్

అన్నపురెడ్డిపల్లి, డిసెంబర్9 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లిలో గ్రామపంచాయతీ లోని రైతువేదిక నందు స్థానిక ప్రజలతో కొత్తగూడెం డిఎస్పి ఎన్నికల నియమ నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలని రాగద్వేషాలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని డి.ఎస్.పి రెహమాన్ తెలిపారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగంలో కల్పించబడిన ఒక గొప్ప అవకాశం అనిఓటు హక్కుచాలా విలువైందని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను ఓటర్లను కోరారు గతంలో నేరచరిత్ర ఉన్న ఘర్షణల గొడవలు జరిగితేవారిపై ముందస్తుగా బైండోవర్ చేస్తామని తెలిపారు.

రాజకీయ ఘర్షణలకు వీడండి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి ప్రస్తుతం ఎన్నికల ప్రశాంత వాతావరణంలోని నిర్వహించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు ఎన్నికల సమయంలో రాజకీయ గర్షణలు కొట్లాటలలో వల్ల సాధించేది ఏమీ లేదని విలువైన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోవద్దని, రాజకీయాల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ సమయమనం పాటిస్తూ ఎన్నికల ప్రక్రియలు పాల్గొనాలని సూచించారు.

గ్రామ ప్రజలు విద్యార్థి యువత జగన్నాధపురం గ్రామాన్ని కల్మషం లేని కోవెల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి లావణ్య, సిఐ లక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సింహ రెడ్డి ,ఎంపీడీవో మహాలక్ష్మి పోలీస్ శాఖ సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.