11 August, 2026 | 1:43 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

21-06-2025 04:43 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

అదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమర వీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలను మంజూరు చేసిందని, దాదాపు పనులను తుది దశకు చేరుకున్నాయని, త్వరలో స్మృతి వనాన్ని ప్రారంభిస్తామని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. స్తూపం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నాడు తెలంగాణ పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అమర వీరుల స్తూపాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పేర్కొన్నారు. అమర వీరుల కుటుంబాలను ఇప్పటికీ ఇంటి స్థలాల పత్రాలు అందించామని తెలిపారు. అమర వీరుల స్తూపాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, రగల్ జెండా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.