calender_icon.png 9 June, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవహర్ లాల్ బాలకేంద్రం ఏర్పాటుకు కృషి

09-06-2025 01:43:22 AM

జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు

కోదాడ జూన్ 8: కోదాడలో జవహర్ లాల్ బాలకేంద్రం ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో రిషి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిర్వహించిన సమ్మర్ డాన్స్ కోచింగ్ లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థులకు డాన్స్ మాస్టర్ పేరిణి నాగేశ్వరరావు తో కలిసి ప్రశంశ పత్రాలు అందజేశారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, రిషి డాన్స్ అకాడమీ మాస్టర్ పేరిణి నాగేశ్వరరావు, లేడీ డాన్స్ కోచర్ లు ప్రవళిక, వర్షిని విద్యార్థుల తల్లిదండ్రులు  పాల్గొన్నారు.