17 April, 2026 | 1:05 PM

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

09-06-2025 01:44 AM

కోదాడ జూన్ 8; కోదాడ ఈఆర్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో ఆది వారం రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు సూర్యాపేట జిల్లా సీనియర్ మహిళల ,పురుషుల జట్లను ఎంపిక చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి తోట రంగారావు ఆదివారం ఇఆర్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో విలేకరుల సమావేశంలో తెలిపారు.

మొత్తం 25 మంది క్రీడాకారులు రాష్ట్ర పోటీలకు వివిధ విభాగాల నుండి ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచింగ్ లు  ఖాజా, పజిల్ నిసార్ ఖాజజలీల్, క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు