17 July, 2026 | 2:43 PM

లోక్‌సభకు కొత్తవాళ్లు ఎనిమిది మంది

05-06-2024 01:03 AM

కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): పార్టీలు వేరైనా.. అభ్యర్థుల లక్ష్యం మాత్రం ఒక్కటే. ఎన్నికల్లో గెలుపొందాలని.. పార్లమెంట్‌లో అధ్యక్షా అనాలని నాయకులు తహతహలాడుతుంటారు. ఇందుకు ఎన్నికలబరిలో నిలిచి నువ్వానేనా అన్నట్టు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తారు. అయితే గెలుపు మాత్రం కొందరినే వరిస్తుంది.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొదటిసారి బరిలో నిలిచినవారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి చాలా మందే ఉన్నారు. కానీ విజయం మాత్రం కొందరికే దక్కింది. ఈ క్రమంలో మొదటిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్న వారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎనిమిది మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెడుతున్నవారు ఐదుగురు ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచినవారు

1. ఖమ్మం రామసహాయం రఘురామరెడ్డి

2. భువనగిరి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

3. నల్లగొండ కుందూరు రఘువీర్‌రెడ్డి

4. వరంగల్ కడియం కావ్య

5. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ

బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచినవారు

1. మెదక్ మాధవనేని రఘునందన్‌రావు

2. మల్కాజిగిరి ఈటల రాజేందర్

3.మహబూబ్‌నగర్ డీకే అరుణ