calender_icon.png 24 October, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారా రోహిత్ పెళ్లి డేట్‌ ఇదే!

22-10-2025 03:04:11 PM

హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకల తేదీలు నిర్ణయించారు. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్‌లో హల్దీ వేడుకతో వివాహ మహోత్సవ సందడి ఆరంభం కానుంది. మరుసటి రోజు అంటే, అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లి కొడుకు వేడుక జరగనుంది. ఇక అక్టోబర్ 28న మెహందీ వేడుక ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెళ్లి ముహూర్తం అక్టోబర్ 30న రాత్రి 10:35కి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకల్లో పలువురు స్టార్‌ యాక్టర్స్‌తోపాటు చిత్రపరశ్రమ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సందడి చేయనున్నారు.