22-10-2025 03:25:32 PM
హైదరాబాద్: తెలంగాణలో జరుగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగనున్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ లతో కేసీఆర్ భేటీకానున్నారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ కానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్ ను కేటీఆర్, హరీశ్ రావు కోరారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, హరీశ్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. కాగా, నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 211 మంది అభ్యర్థులు ఉన్నారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.