22-10-2025 02:53:28 PM
హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన సమాజ హక్కుల కోసం గోండు వీరుడు కొమురం భీమ్ జరిపిన ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాలకు స్ఫూర్తిని నింపిందని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కొమురం భీమ్ జయంతి( Komaram Bheem Jayanti) సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ, వారి త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో పోరాడిన కొమురం భీమ్ ఆశయాలను పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసి, ప్రగతి ఫలాలను చివరి ఆదివాసీ గడపకు చేర్చామని కేసీఆర్ పేర్కొన్నారు. కొమురం భీమ్ ఆకాంక్షలకు అనుగుణంగా, ఆదివాసీ గిరిజన ప్రజల సబ్బండ కులాల అభ్యున్నతికి పాటుపడడం ద్వారానే వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం తెలిపారు.