8 April, 2026 | 6:38 AM

టీఎస్ ఈసెట్ పరీక్ష ప్రశాంతం

07-05-2024 01:24 AM

96.12% మంది హాజరు

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): టీఎస్ ఈసెట్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ పరీక్షకు మొత్తం 96.12 శాతం మంది హాజరైనట్లు కన్వీనర్ ప్రొ.పి.చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో 22,272 మంది దరఖాస్తు చేసుకోగా, 21,513 (96.58 శాతం) మంది పరీక్ష రాశారు. ఏపీ నుంచి 2 వేల మందికిగానూ 1817 (90.85 శాతం) మంది హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 99 పరీక్షా కేంద్రాల్లో 24,272 మందికి 23,330 (96.12 శాతం) మంది పరీక్ష రాశారు. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అభ్యర్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ఈసెట్ ద్వారా 2024 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.