30-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తూ ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రావడంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి తక్షణం నిలుపుదల చేశారు.
ఉదయం 11 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించగా ఆ తర్వాత కోడ్ రావడంతో వచ్చిన అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్ అప్పటికప్పుడు వారిని బయటకు పంపించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండాలని కోడు ఉల్లంఘిస్తే ఎవరిపైన నా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.