calender_icon.png 30 September, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలి

30-09-2025 12:00:00 AM

సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 29: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లకు రావాల్సిన 6 నెలల కమిషన్ డబ్బులు ఇవ్వాలని సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు వంగరి నాగరాజు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా కమీషన్ చెల్లింపులు నిలిచిపోవడంతో రేషన్ డీలర్ల కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయని, గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే రేషన్ డీలర్లకు ఉద్యోగుల్లా పరిగణించి గౌరవ వేతనం కలిపిస్తామన్న హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎంఎల్‌ఎస్ లెక్కల పేరుతో వేసే అదనపు భారాన్ని తగ్గించాలని,ప్రస్తుతం కమీషన్ రాకపోవడం వల్ల పండుగ సీజన్లో డీలర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వెంటనే బకాయిలను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్లు పాల్గొన్నారు.