30-09-2025 12:00:00 AM
జహీరాబాద్, సెప్టెంబరు 29 : ఆస్తి తగాదాలతో ఒక నిండు ప్రాణం బలైంది. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతల ఘట్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. చింతల ఘట్ గ్రామంలో బేగరి ముల్లయ్యకు ము గ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడు జయంత్, రెండవ కుమారుడు జయరాజ్, మూడో కుమారుడు జయరాం. ఆగస్టు 1న బేగరి ముల్లయ్య మరణించాడు.
వీరికి సం బంధించిన రెండు ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఉంది. ముగ్గురు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని సమానంగా పంచుకోవాలనే విషయంలో గొడవలు చెలరేగాయి. దీంతో జ యరాం ఆస్తిని ఎవరికీ ఇవ్వనని, మొత్తం ఆ స్తి తనకేనని ఇద్దరు సోదరులతో గొడవపడ్డా రు. ఆదివారం నాడు పెద్ద కుమారుడైన జ యంత్ ఇద్దరు తమ్ముళ్లకు నచ్చజెప్పి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ రెండవ కుమా రుడు చిన్న కుమారుడు గొడవపడడంతో హత్యకు దారి తీసిందని భావిస్తున్నారు.
రెండవ కుమారుడు జైపాల్ తమ్ముడైన జయరాం(35)ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్నపెద్ద అ న్న ఇంటికి వచ్చి చూసేసరికి తమ్ముడు రక్తమడుగులో చనిపోయి ఉండటంతో పోలీసు లకు సమాచారం అందించారు. దీంతో కో హిర్ సబ్ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, జాగిలాలతో పరీక్షలు నిర్వ హించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద అన్న జయంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోహిర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.