06-12-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్ 5(విజయ క్రాంతి): పంచాయతీ ఎన్నికల నిర్వ హణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యా ధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం తిర్యాణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు, రికార్డులను పరిశీలించి ఎన్నికల సంబంధిత విధులు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు పలు సూ చనలు చేశారు.
నామినేషన్ దాఖలు దాదాపుగా పూర్తి అయినందున ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నామినేషన్లను పరిశీలించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనం నిర్వహణ, మహిళా స్వయం సహాయక సంఘా ల కార్యకలాపాలపై సమీక్షించి పొదుపు సంఘాల ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూత పథకాలను సక్రమంగా అమలు చేస్తూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గర్భిణు లు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికల సం క్షేమంలో భాగంగా సకాలంలో మెనూ ప్రకా రం పౌష్టిక ఆహారాన్ని అందించాలని, గర్భిణులు గర్భస్థ సమయంలో పాటించవలసిన జాగ్రత్తలను వివరించాలని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎదుగుదల లోపం గల పిల్లలను గుర్తించి సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పి.వి.టి.జి. (ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న గిరిజన సమూహాలు) లబ్ధిదారులకు ప్రభు త్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. మండలంలోని రాళ్ల కన్నెపల్లి గ్రామంలో గల ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రిజిస్టర్లు, మధ్యా హ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. మన ఊరు - మన బడి పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సందర్శించి పనుల నాణ్యత, పురోగతిని పరిశీలిం చారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమన్వయంతో పని చేసి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.