09-12-2025 06:50:18 PM
మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం రాత్రి ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దూస కృష్ణ, బెజ్జంకి జగన్, కోశాధికారిగా పి. పాపారావు, సహ అధ్యక్షులుగా కే నాగేశ్వర్, ఉపాధ్యక్షులుగా బీ సత్యనారాయణ, బీ రాజమౌళి, కె సంపూర్ణ, కార్యదర్శులుగా బీ శంకర్ గౌడ్, కే వైకుంఠం, సంయుక్త కార్యదర్శులుగా ఎల్. ప్రేమ్ రావు, కే మల్లయ్య, కార్య నిర్వాహక కార్యదర్శులుగా పి. తిరుపతి, జె. కైలాసం, పి.సత్తమ్మ, బళ్ళు శంకర్లింగం, గుండేటి యోగేశ్వర్ లు ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు.