17 April, 2026 | 3:48 PM

Breaking News

గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న   •   కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •  

పిఆర్టియుటీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

14-06-2025 08:36 PM

అధ్యక్షులుగా డి వెంకటేశ్వరరావు, (డివి), ప్రధాన కార్యదర్శిగా రవి..

హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టియుటిఎస్(PRTUTS) నూతన కమిటీ ఎన్నిక శనివారం పాల్వంచలోని బొల్లారం టిటిడి కళ్యాణ మండపంలో జరిగింది. అధ్యక్షులుగా డి వెంకటేశ్వరరావు (డీ వి), ప్రధాన కార్యదర్శిగా బి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల నియమ నియమావళి ప్రకారం జిల్లాలోని 23 మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో  పాల్గొని నూతన కమిటీని ఎన్నుకొన్నారు. అధ్యక్షులు డి. వెంకటేశ్వరరావు( డివి) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి లను అట్టహాసంగా 23 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా రాష్ట్ర బాధ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణస్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు( డివి) బి రవి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనిఅన్నారు.పెండింగ్ బిల్లులు, డి ఎ, సిపిఎస్ సాధనకై జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.