17 April, 2026 | 2:09 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

11 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకొని నాయకుడు మోదీ

14-06-2025 08:39 PM

అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ  ప్రభుత్వం

రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలం

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి  (విజయక్రాంతి): కేంద్రంలో నరేంద్ర మోదీ  ప్రధాని పదవి చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పోటో ప్రదర్శన(ఎగ్జిభిషణ్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి(MLA Katipally Venkata Ramana Reddy) ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వికసిత భారత్ - 2047 లక్ష్యంపై బిజెపి కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ... 11 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకొని నాయకుడు మోదీ అని నిరంతరం దేశ అభివృద్ధికి పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు నరేంద్ర మోదీ సొంతం అని అన్నారు. రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలం అయ్యిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కుంట లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, నరేందర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.