25 August, 2026 | 3:38 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి వినతి

25-08-2026 01:45 AM

ఆత్మకూరు, ఆగస్టు 24: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పలు ప్రజా సమస్యలపై ఎంపీడీవో శ్రీరామ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలను మెరుగుపరచాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఉపాధితో పాటు జీవనభృతి, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, గ్యాస్ సబ్సిడీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.