calender_icon.png 1 December, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న ఎన్నికల అధికారులు

01-12-2025 07:12:20 PM

బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాంప్రసాద్ ఆరోపణ..    

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార పార్టీకి స్థానిక ఎన్నికల అధికారులు కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిబంధనలు అనుసరించి అనర్హుడైనప్పటికీ స్క్రూటినీలో అతని పేరు తొలగించకుండా అధికార పార్టీ వత్తిల్లకు ఎన్నికల అధికారులు తలవంచటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల నిబంధనలను ఎందుకు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరమని, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తాము సహకరిస్తూ ఉంటే ఎన్నికల అధికారులు ఈ రకంగా అధికార పార్టీకి వత్తాసు పలకటం, అనర్హులను సమర్ధించటం ప్రజాస్వామ్య వ్యవస్థలో సబబు కాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెసు, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని డ్రామాలాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.