01-12-2025 07:09:27 PM
సినీయర్ పిరమిడ్ మాస్టార్ సునీత..
తలమడుగు (విజయక్రాంతి): ప్రపంచ మానవులకి దారిచూపిన గీతా మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పరమాంస సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్రంలో గీతా జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. గీతా జయంతి సందర్భంగా తలమడుగు గ్రామానికి చెందిన కాటి పెళ్లి లక్ష్మి దేవి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భక్తులకు ఉచితంగా పూలాజి బాబా జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సునీత వెంకట్ మాట్లాడుతూ.. మానవ జీవికి గీత ఎంతో అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకోనీ, భగవద్గీత పఠనంతో పాటు ధ్యానం చేయాలని కోరారు. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యాలయంలో పులాజి బాబా ధ్యాన కమిటీ అధ్యక్షులు కాటిపల్లి సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలగిరి అశోక్, ప్రధాన కార్యదర్శి సునీత రెడ్డి, గ్రామ పెద్దలు కోటిపల్లి అశోక్ రెడ్డి, కాటిపిల్లి కేశవరెడ్డి, ఉషా రెడ్డి, బాగిడి భూమయ్య, రాధవ్వ, భోజమ్మా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.