calender_icon.png 11 December, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

10-12-2025 07:38:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గురువారం నిర్వహించే ఎన్నికల పోలింగ్ కు అవసరమయ్యే సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండలాల పరిధిలో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయగా సామాగ్రితో వారిని ప్రత్యేక బస్సుల్లో రూట్లవారిగా, జోన్లవారీగా గ్రామాలకు అధికారులు తరలించారు. ఎన్నికల అనంతరం కౌంటింగ్ నిర్వహించి సిబ్బంది గురువారం రాత్రి తిరిగి రానున్నారు. ఎన్నికల సిబ్బందికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ద్వారా కల్పించారు.