11-12-2025 01:45:38 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 10(విజయ క్రాంతి): ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభు త్వం మోసం చేసిందని, వారి సంక్షేమానికి పోరాటం తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన నెలకు వెయ్యి చెల్లింపు హామీ మేరకు పెం డింగ్‌లో ఉన్న రూ.1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రెండేళ్లలో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.1,560 కోట్లు అప్పు ఉంద ని, ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు రూ.24 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. తమ హయాం లో ఆటో డ్రైవర్లకు బీమా కల్పిస్తే కాంగ్రెస్ దాన్ని కూడా ఊడగొట్టిందని, అందుకే 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇవి ప్రభుత్వ హత్య లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే హైదరాబాద్‌లో మహా ధర్నాకు దిగుతామని ప్రభు త్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో ఆటో డ్రైవర్లు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మార్పు, మా ర్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుం దో రెండేళ్లలో ప్రజలకు అర్థమైందని కేటీఆర్ విమర్శించారు.
రైతులు, యువత, మహిళలు సహా అందరినీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారని, రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెపుతూ, దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడు తున్నారని దుయ్యబట్టారు. తమ హయాంలో దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, నేడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల వల్ల రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఫిబ్రవరిలో మహా ధర్నా
ఆటో డ్రైవర్ల హక్కుల సాధనకు తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి లోపు బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మహా ధర్నా చేస్తామని ప్రకటించారు. ‘కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గళ్లా పట్టి అడిగితేనే ఇస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక క్రెడిట్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడాలని వారికి సూచించారు. కాగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా సుమారు 7 లక్షల మంది ఆటో కార్మికులకు, 5 లక్షల ప్రమాద బీమాను కల్పించారన్నారు.