18-12-2025 12:03:32 PM
మండలంలో 87.84 శాతం పోలింగ్
చెన్నూర్,(విజయక్రాంతి): చెన్నూర్ నియోజక వర్గంలోని చెన్నూర్ మండలంలో 30 గ్రామ పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవం కాగా 29 జీపీలకు, 244 వార్డులుండగా 45 ఏకగ్రీవం కాగా 199 వార్డులకు బుధ వారం ఎన్నికలు నిర్వహించారు. 29 జీపీలకు 115 మంది, 199 వార్డులకు 513 మంది పోటీపడ్డారు. మండలంలో 26,102 (12,839 పురుషులు, 13,263 మహిళలు) మంది ఓటర్లున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొమ్మిది గంటల వరకు 7,118 (27.27%), 11 గంటల వరకు 16,425 (62.93%), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 22,928 (87.84%) పోలింగ్ జరిగింది. చెన్నూర్ లో సైతం ఇండిపెండెంటుల హవా కొనసాగింది.
విజేతలు వీరే...
చెన్నూర్ మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో రచ్చపల్లి జీపీ సర్పంచుగా గెల్లు లక్మ్షీ (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కెపల్లి జీపీ సర్పంచుగా నక్క కల్పన (కాంగ్రెస్), బీరెల్లి సర్పంచుగా దుర్గం ధర్మరాజు (కాంగ్రెస్), గంగారాం సర్పంచుగా కుడుదుల మల్లక్క శంకర్ (కాంగ్రెస్), ముత్తరావుపల్లి సర్పంచుగా జిట్ట రాజేష్ (కాంగ్రెస్), ఆస్నాద్ సర్పంచుగా బెల్లంకొండ సజిత (కాంగ్రెస్), సంకారం సర్పంచుగా మడె అర్జయ్య (కాంగ్రెస్), ఎర్రగుంటపల్లి సర్పంచుగా డెబ్బ సుగుణ (కాంగ్రెస్), కాచన్ పల్లి సర్పంచుగా దుర్గం రామయ్య (కాంగ్రెస్), భావురావుపేట సర్పంచుగా తాటి శ్రీను గౌడ్ (కాంగ్రెస్), లింగంపల్లి సర్పంచుగా అంగ రమేష్ (కాంగ్రెస్),
నారాయణపూర్ సర్పంచుగా పెద్దింటి సంతోష్ (ఇండిపెండెంట్), సోమన్ పల్లి సర్పంచుగా తోకల మల్లేష్ (ఇండిపెండెంట్), అంగ్రాజుపల్లి సర్పంచుగా పాగె రాజమణి (ఇండిపెండెంట్), బుద్దారం సర్పంచుగా ఆలం లక్ష్మీ (ఇండిపెండెంటు), చాకెపల్లి సర్పంచుగా బల్ల సమ్మయ్య (ఇండిపెండెంటు), లంబాడిపల్లి సర్పంచుగా నగావత్ మహేష్ (ఇండిపెండెంటు), ఓత్కులపల్లి సర్పంచుగా జాడి తిరుపతి (ఇండిపెండెంటు), కత్తెరశాల సర్పంచుగా చేతెల్లి పద్మ (ఇండిపెండెంటు), సుద్దాల సర్పంచుగా డోంగిరి స్వప్న (ఇండిపెండెంటు), వెంకంపేట సర్పంచుగా అయిత రాజిరెడ్డి (ఇండిపెండెంట్),
సుందరశాల సర్పంచుగా గుండ మంజుల రాంగోపాల్ రెడ్డి (ఇండిపెండెంట్), కొమ్మెర సర్పంచుగా జోగూరి చంద్రయ్య (ఇండిపెండెంట్), దుగ్నెపల్లి సర్పంచుగా ఆత్కూరి రమేష్ (బీఆర్ఎస్), కిష్టంపేట సర్పంచుగా రావుల తిరుమల (బీఆర్ఎస్), పొక్కూర్ సర్పంచుగా అయిత స్వరూప సత్యనారాయణ (బీఆర్ఎస్), పొన్నారం సర్పంచుగా నిమ్మల నాగరాజు (బీఆర్ఎస్), చెల్లాయిపేట సర్పంచుగా చెలిమెల స్వరూప (బీఆర్ఎస్), నాగాపూర్ సర్పంచుగా అన్నల తిరుపతి (బీఆర్ఎస్), చింతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచుగా మామిడి రాజు (బీఆర్ఎస్)లు ఎన్నికయ్యారు.