calender_icon.png 18 December, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచికలపేటకు పెద్దపులి రాలేదు

18-12-2025 12:00:29 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మద్దు

ఎన్టీపీసీ, లింగాపూర్ లోనే నేడు పులి అడుగులు గుర్తించాం: జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పెంచికలపేటలో పెద్దపులి తిరుగుతుందని బైక్ వెంట పడ్డదని కొంతమంది చేస్తున్న పుకార్లను నమ్మవద్దని, పెద్దపులి ఆనవాళ్లు  పెంచికపేటలో లేవని, జిల్లా  అటవీశాఖ అధికారి శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతులను ప్రజలు నమ్మద్దని, పెద్దపులి ఎన్టీపీసీ, లింగాపూర్ ఏరియా లోనే తిరుగుతుందని, ఈ రోజు ఉదయం పెద్దపులి అడుగులను లా లింగపూర్ లోనే గుర్తించామని జిల్లా అటవీశాఖ అధికారి  తెలిపారు.

కొంతమంది పెంచికలపేటలో పులి వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారని, ప్రజలు భయపడవద్దని, పులి లింగపుర్ ప్రాంతంలో ఉందని, తమ సిబ్బంది ఎప్పటికప్పుడు పెద్దపులి అడుగుజాడలను గుర్తిస్తూ... ట్రాక్ చేస్తున్నారని, పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు తెలుపుతారని, సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మవద్దని, ఏదైనా అనుమానం ఉంటే అటవీశాఖ సిబ్బందికి ప్రజలు ఫోను చేసి తెలుసుకోవాలని శివయ్య సూచించారు.