08-07-2025 12:00:00 AM
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ఈ జూలైతో గడువు ముగియను న్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని పలువురు నిర్మాతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై వారు ఛాంబర్ బాధ్యులకు మెమొరాం డం అందజేశారు.
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అం దుబాటులో లేకపోవటం వల్ల ఛాంబర్ జనరల్ మేనేజర్ నారాయణకు ఈ మెమొరాండాన్ని ఇచ్చారు. ప్రతాని రామకృష్ణగౌడ్, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలింఛాంబర్‌లోని నాలుగు సెక్టార్ల నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “ఒక ఈసీ మెంబర్ రాసిన లేఖ ఆధారంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన ఈసీ మీటింగ్‌కు హాజరు కాని సభ్యుడి ప్రతిపాదనకు మిగతా వారు ఎలా ఒప్పుకుంటారు? ఛాంబర్‌లో కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. వారే స్వార్థంతో ఎన్నికలను వాయిదా వేయాలంటున్నారు” అన్నారు. మెమొరాండం సమర్పించిన వారిలో గురురాజ్, అల్లాభక్స్, శంకర్‌రెడ్డి, బులెట్ రవి, వింజమూరి మధు తదితరులు ఉన్నారు.