calender_icon.png 8 July, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కాంతార: చాప్టర్ 1 వచ్చేది అప్పుడే

08-07-2025 12:00:00 AM

2022లో విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు నమోదు చేసింది. అంతేకాదు పాన్-ఇండియా స్థాయి లో భారీ విజయాన్ని అందుకొని, కొత్త బం చ్‌మార్క్స్ సృష్టించింది. హోంబలే ఫిలింస్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే.

‘కాంతార: చాప్టర్1’ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా గా మేక ర్స్ సినీప్రియులకు మరో సరికొత్త కానుక ను ఇచ్చారు. సోమవారం హీరో రిషబ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు షూటింగ్ పూర్తయినట్లు చెప్తూ.. రిలీజ్ డేట్‌నూ ప్రకటించారు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.