calender_icon.png 3 May, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ భద్రత వారోత్సవాలు

02-05-2025 08:26:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాల్లో ఈ నెల ఒకటి నుంచి ఏడు వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ బి.సుదర్శన్ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో విద్యుత్ భద్రత వారోత్సవాల ప్రాధాన్యతను ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నారని లూస్ లైన్స్ తెగిపోయిన వైర్లు వంగిపోయిన విద్యుత్ స్తంభాలు నోవోల్టే సమస్య మీటర్ రీడింగ్ తప్పులు ఆన్లైన్ బిల్లింగ్ పేమెంట్ వ్యవసాయ కనెక్షన్లు తదితర అంశాలపై అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డీ నాగరాజు విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.