వీధి కుక్కల దాడిలో విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగికి గాయాలు
14-12-2025 07:28 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో కరెంటు బిల్లులు తీస్తున్న విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి జాకీర్ పై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలు వెంబడించి దాడి చేయడంతో గాయాలయ్యాయి. వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామ పంచాయతీ అధికారులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.






