14-12-2025 07:20:03 PM
మఠంపల్లి (విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు శానంపూడి సైదిరెడ్డి, ఖమ్మం బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బంది నాయకులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మట్టపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ, బీజేపీ మండల అధ్యక్షులు వెంకట శివ, అయ్యప్ప, సోమగాని ప్రదీప్, మురళి తదితరులు పాల్గొన్నారు.