calender_icon.png 8 January, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ప్రజా బాట

07-01-2026 04:02:13 PM

కాటారం,(విజయక్రాంతి): విద్యుత్తు సమస్యల పరిష్కారానికై ఆ శాఖ ప్రజాబాట పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో పలు గ్రామాలలో ప్రజలతో సమావేశాలు నిర్వహించింది. బుధవారం మండలంలోని ధన్వాడ దామరకుంట గ్రామాల్లో విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యుత్తు శాఖ తరపున ఏవేని సమస్యలు ఉన్నట్లయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు వివరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం విద్యుత్ శాఖ ఏడిఈ బి రమేష్, ఏఈ బి.ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.