calender_icon.png 8 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిల్డ్రన్ హోం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

07-01-2026 04:10:37 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వృద్దుల ఆశ్రమం సందర్శన, పండ్ల పంపిణీ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆద్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం నిర్మాణ పనులను ఇంచార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ ప్లాన్, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. 

త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్ళండి

తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ వృద్దుల ఆశ్రమంలోని వృద్దులను వేములవాడలో నిర్వహించనున్న త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ వృద్దుల ఆశ్రమాన్ని ఇంచార్జి కలెక్టర్ బుధవారం సందర్శించారు. ముందుగా ఆవరణ, వసతి గదులు, వంట గది, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్బంగా వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.

ప్రతి రోజూ టిఫిన్, భోజనం, ఆరోగ్య అంశాలపై వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎందరు వృద్దులు ఆశ్రయం పొందుతున్నారో ఆరా తీసారు. 37 మంది ఉన్నారని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి జిల్లా సంక్షేమ అధికారి తీసుకువెళ్లారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వృద్దుల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వైద్య శాఖ వద్ద ఉన్న పాలియేటీవ్ కేర్ వాహన సేవలు వృద్దుల కోసం వినియోగించాలని సూచించారు. వృద్దులను విహార యాత్రలకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. పరిశీలనలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం  తదితరులు పాల్గొన్నారు.