18-10-2025 08:29:26 PM
గాంధారి,(విజయక్రాంతి): గాంధారి మండల కేంద్రంలోని విద్యుత్ ఉద్యోగులు డిఈ విజయ సారధి, ఏడిఈ మల్లేశం ఆదేశానుసారం విద్యుత్ ఉద్యోగులు శనివారం రోజున పొలంబాట నిర్వహించారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా వంగిన 11kv పోల్ అదేవిధంగా వదులుగా ఉన్నటువంటి విద్యుత్ తీగలను సరి చేశారు. ఈ సందర్భంగా ఏఈ లక్ష్మయ్య మాట్లాడుతూ... విద్యుత్ వినియోగదారులు బోరుబావుల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పి చేయించాలన్నారు. విద్యుత్ ను పొదుపుగా వాడి భావితరాలకు మిగులు విద్యుత్తుగ ఉండేలా చూడాలన్నారు.