18-10-2025 08:29:31 PM
పాపన్నపేట (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాపన్నపేట మండలంలో అఖిలపక్షం నాయకులు పలు వ్యాపార సంస్థలను మూసి వేయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజెపీ, సీపీఐ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రధాన విధుల గుండా నినాదాలు చేస్తూ దుకాణాలను మూసి వేయించారు. వివిధ పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు మాత్రమే బందులో పాల్గొన్నారు. అనంతరం తహసిల్దార్ సతీష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.