calender_icon.png 19 October, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీ

18-10-2025 08:27:36 PM

చేర్యాల: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చేర్యాల యందు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల బాలుర బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు మిగిలిన సీట్లకు నిర్వహించిన అడ్మిషన్స్ కౌన్సిలింగ్ శనివారం నిర్వహించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 800 మంది పైచిలుకు విద్యార్థులు పాల్గొని సీట్లు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ జోనల్ అధికారి ప్రత్యూష జిల్లా సమన్వయ అధికారి పోలోజు నరసింహ చారి గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా సమన్వయ అధికారి పోలోజు నరసింహ చారి కృతజ్ఞతలు తెలియజేశారు.