calender_icon.png 25 December, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రజాబాట’లో విద్యుత్ ఉద్యోగులు

24-12-2025 12:00:00 AM

చౌటుప్పల్, డిసెంబర్ 23(విజయ క్రాంతి):చౌటుప్పల్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు ప్రజా బాట లో భాగంగా ప్రతి వారం రోజులలో మూడు రోజులు ఫీల్ మీద విద్యుత్ స్తంభాల వద్ద  మరియు ట్రాన్స్ఫర్ వద్దా మరమతులు  లో భాగంగా చౌటుప్పల్ పట్టణం రత్నానగర్లో ట్రాన్స్ఫర్ ల వద్ద మరమ్మతులు మరి ఫీజులు దాని చుట్టూ పరిశుభ్రంగా చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  డి ఈ  డిఎస్ మల్లికార్జున  వచ్చి పనులు పర్యవేక్షించారు అనంతరం మాట్లాడుతూ విద్యుత్ సంస్థ ఉద్యోగులు వారంలో మూడు రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించాలని అందులో భాగంగా ట్రాన్స్ఫార్న వద్ద మరమ్మతులు చేయాలని ఇలా చేయడం వలన విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ సప్లై సక్రమంగా వినియోగం అవుతుందని అలాగే వినియోగదారులకు సేవలు అందించినట్లు అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏడి పద్మ  ,ఏ ఈ సతీష్ ,లైన్మెన్ తిరుమలయ్య, జూనియర్ లైన్మెన్ నాగరాజు ,బిక్షపతి, శ్రీనివాస్ రాజు, నరసింహ ,జైపాల్ రెడ్డి ,ప్రవీణ్ తదితరులు ఉద్యోగులు పాల్గొన్నారు.