21-07-2025 12:51:14 AM
బోనాల పండుగలో పాల్గొన్న శాసనసభ్యులు మదన్మోహన్
ఎల్లారెడ్డి జులై 20,(విజయక్రాంతి): ఆషాడ మాసంలో జరుగుతున్న బోనాల పండుగలో భాగంగా ఆఖరి ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. బోనాల పండుగ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ పాల్గొన్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి నుండి గొర్రె పొట్టేళ్లతో పలహారం బండి బోనాలు కళాకారుల నృత్యాలు పోతరాజుల విన్యాసాలు వార్డుల నుండి ఆలయం వద్దకు భారీ జనం సందడితో డబ్బు సప్పులతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు బోనాల పండుగ వద్ద కళాకారులను ముత్యాలను పోతరాజుల విన్యాసాలను చూసి సంబరపడ్డారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి నుండి ఆలయం వద్దకు ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే మదన్మోహన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రాథమిక సహకార సంఘం ఎల్లారెడ్డి ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ప్రజలకు అభివాదం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదాధికారులు ప్రజలు వివిధ మండలాల నుంచి వచ్చిన మండల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.