calender_icon.png 21 July, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై నిలిచిన నీళ్లు... వాహనదారులకు అవస్థలు

21-07-2025 12:52:36 AM

సిరికొండ జూలై 20 (విజయ క్రాంతి):  సిరికొండ మండల కేంద్రం నుండి నిజామాబాద్ వెళ్లే మార్గమధ్యంలో గల సర్ పల్లి తాండ గ్రామపంచాయతీ, పరిధిలోని హరే కృష్ణ మందిరం దగ్గర, రోడ్డుపైన నిలిచి ఉన్న నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  రోడ్డుపైన చెరువుల తలపించే విధంగా ఉన్న నీటిలో నుండి వాహనదారులు వెళ్లాలంటే జంకుతున్నారు,

ఎదురెదురుగా వస్తున్న సమయంలో  ఆ మట్టి నీళ్లు బట్టల పై పడడంతో బట్టలు  తడిచిపోయి మరకలమయం అవుతున్నాయని, ద్విచక్ర వాహనంలోకి , నీళ్లు వెళ్లడంతో  ప్లగ్గులు చెడిపోతున్నాయని వాహనదారు తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ఆ నీటిని పక్కనుంచి మళ్ళించే ప్రయత్నం చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,

అసలు ఆర్ అండ్ బి శాఖ అధికారులు సిరికొండ మండలంలో  క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యల గురించి తెలుసుకునే సమయం కూడా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉన్నతాధికారులను, నాయకులను, కోరుతున్నారు.