21-05-2025 09:17:00 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)కు మద్దతు ఇవ్వడంపై ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ, తన టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బాగానే పనిచేస్తోందని నొక్కి చెబుతూ, బిలియనీర్ ఎలాన్ మస్క్(Billionaire Elon Musk) మంగళవారం తన సంపదను రాజకీయాల కోసం ఖర్చు చేయడం నుండి వెనక్కి తగ్గుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువగా ఖర్చు పెడతానని మస్క్ దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో టెక్సాస్‌లోని ఆస్టిన్ నుండి వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ అన్నారు. రాజకీయ ప్రచారాల కోసం ఇప్పటికే చాలా ఖర్చు పెట్టినట్లు మస్క్ పేర్కొన్నాడు. ఇక నుంచి వ్యాపారాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని వెల్లడించారు.
వచ్చే ఏడాది అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ మస్క్ ఈ ప్రకటన చేశారు. మస్క్ నిర్ణయం రిపబ్లికన్ పార్టీ నేతలకు ఎదురుదెబ్బలేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్(Elon Musk) ట్రంప్ కు మద్దతుగా నిలిచాడు. ట్రంప్ గెలుపు కోసం పొలిటికల్ యాక్షణ్ కమిటీల ద్వారా మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. భూమిపై అత్యంత ధనవంతుడైన మస్క్, 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేశాడు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక డోజ్ అనే కొత్త విభాగానికి మస్క్ అధిపతి అయ్యాడు. ఫెడరల్ ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ఉద్దేశంతో మస్క్ పలు నిర్ణయాలు తీసుకున్నాడు. ఎలాన్ మస్క్ నిర్ణయాలపై అమెరికన్ పౌరులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో అతని విరాళం కొనసాగుతుందా అనే ప్రశ్నలు వాషింగ్టన్‌లో విస్తృతంగా ఉన్నాయి.