21-05-2025 01:27:30 AM
-భారత్‌లో 257 యాక్టివ్ కేసులు
- తీవ్రత తక్కువేనన్న ఆరోగ్య శాఖ
- ఆసియా దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి
- హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ, మే 20: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, థాయ్ లాండ్ తదితర దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తు తం భారత్‌లో 257 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే వీటిలో అధికశాతం తేలికపాటి లక్షణాలు ఉన్న కేసులే ఉండడం కాస్త ఉపశ మనం. భారత్‌లో కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరో గ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభు త్వం అందించిన సమాచారం ప్రకారం మే 12 తర్వాత కేరళలో అత్యధికంగా 69 కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 నమోదయ్యా యి. కర్ణాటకలో ఎనిమిది, గుజరాత్‌లో ఆరు, ఢిల్లీలో మూడు, హర్యానా, రాజస్థాన్‌లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రిలో కోవిడ్ ఇద్దరు మృతి చెందారు.
పెరుగుదలకు కారణాలు?
ఆసియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి ఓమిక్రాన్ ఉప వేరియంట్లయిన జేఎన్ ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సింగపూర్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో 14వేల కరోనా కేసులు వెలుగు చూశా యి. అంతకుముందు వారం కూడా దాదాపు 11వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక థాయ్‌లాండ్‌లోనూ వారానికి వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో ఒక్క రెండో వారంలోనే 33 వేల కేసులు నమోదైనట్టు అంచనా.
అటు హాంకాంగ్‌లోనూ కోవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. చైనాలోనూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసు ల పాజిటివిటీ రేటు 7.8 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు సమాచారం. వాతావరణ పరిస్థితులు, సాముహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది.