7 July, 2026 | 2:19 AM

ఉన్నతాధికారుల ఈగోకు ఉద్యోగుల బలి

07-07-2026 01:34 AM
  1. ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు రఘునందన్ 
  2. హైకోర్టు తీర్పుపై హర్షం

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఉన్నతాధికారుల ఈగోకు ఉద్యోగులను బలి చేయడం స రైంది కాదని, ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అమలు వి షయంలో.. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల పట్ల కొందరు అధికారులు ఏక పక్షంగా వ్యవహరించడం సహజ న్యాయ సూ త్రాలకు విరుద్దమని ఉన్నత ధర్మాసనం స్పష్టం చే యడం

ఎంతో మంది ఉద్యోగులకు విషయం పట్ల అవగాహన వచ్చేలా చేసిందన్నారు. కొందరు ఉన్నతాధికారులు ఉద్యోగుల పట్ల తమ ఇష్టారీతిన నిర్ణ యాలు తీసుకోవడం వల్ల ఉద్యోగుల సర్వీస్‌లో రిమార్క్ వచ్చే అవకాశం ఉండటమే గాక..వారు పని చేసే ఆయా కార్యాలయాల్లో తోటి సిబ్బంది తో పాటు ఇతర అధికారులు చులకన భావంతో వ్యవహరించే అవకాశం ఉందని రఘునందన్ వివరించా రు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా..ఉన్నతాధికారుల ఈగోకు ఉద్యోగులను బలిచేయొద్దన్నారు.