7 July, 2026 | 2:19 AM

సమరభేరి సభ విజయవంతం

07-07-2026 01:35 AM
  1. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): భువనగిరిలో నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభను చారిత్రాత్మక విజయంగా ని లిపిన తెలంగాణ ప్రజలందరికీ పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సభ విజ యవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు, అమరవీరుల కుటుంబాలకు, మేధావులకు, కార్మికులకు, ఉద్యోగులకు, మహిళా సంఘాలకు, మాజీ మావోయిస్టులకు, యువతకు,

కళాకారులకు, ప్రజాసంఘాల నాయకులకు, మీడి యా మిత్రులకు, వాలంటీర్లకు, సభ నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా లక్షలాదిగా భువనగిరికి తరలివచ్చి రాజ్యాధికార ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల ప్రేమ, ఆదరణ, వి శ్వాసం తనకు ఎంతో బాధ్యతను పెంచాయని తెలిపారు. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా చివరి శ్వాస వరకు పోరాడతానని స్పష్టం చేశారు.