calender_icon.png 31 January, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం

31-01-2026 03:10:55 PM

హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్,(విజయక్రాంతి): ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజమని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డి పదవి విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ… రాంచంద్రారెడ్డి పోలీస్ కానిస్టేబుల్‌గా జిల్లా పోలీస్ శాఖలో నియమితులై, గడిచిన 39 సంవత్సరాలుగా వివిధ పోలీస్ స్టేషన్లలో సాధారణ విధులతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించారని తెలిపారు. తనకు కేటాయించిన ప్రతి విధిని నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ, సర్వీస్ కాలమంతా ఏ చిన్న రిమార్క్ లేకుండా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు.

రాంచంద్రారెడ్డి  పోలీస్ శాఖకు అందించిన సేవలు అమూల్యమైనవని, ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం రావలసిన అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భగవంతుడుఆయురారోగ్యాలు ప్రసాదించి, మిగిలిన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే పోలీస్ శాఖ తరపున ఆయనకు మరియు ఆయన కుటుంబానికి ఎల్లవేళలా సహాయ, సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, డీపీఓ సిబ్బంది, రాంచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.