calender_icon.png 31 January, 2026 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు

31-01-2026 03:08:03 PM

నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాయుద్ధ నౌక గద్దర్ 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ నాయకులతో కలిసి గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గద్దర్ బడుగు, బలహీన, పీడిత వర్గాల గొంతుకగా తన పాటలు, మాటలతో ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప సామాజిక ఉద్యమకారుడు  అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.