31-01-2026 02:59:59 PM
తరిగొప్పుల,(విజయక్రాంతి): మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామానికి చెందిన కాసర్ల రాణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు మానవత్వం చాటుకున్నారు. శనివారం రోజున బాధిత కుటుంబానికి రూ.50 వేలు తమ కుమార్తెలకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావటి సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇంకా ఎవరికైనా పేద కుటుంబాలకు జరుగుతే గ్రామ ప్రజలు ముందుకు వచ్చి తమకు తోచిన అంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రాజు, కుంభం రమేష్, నీల కనకరాజు, బాల కుమార్, నీల నరసింహులు, కాటం నరేష్, భాష బోయిన నవీన్, బాల్రాజ్, శ్రావణ్, సందీప్, నరేష్, రాజు, ఐలయ్య నవీన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.