calender_icon.png 31 January, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఎస్పీ నితిక పంత్

31-01-2026 03:05:30 PM

ఏఎసై అశోక్ సేవలు అభినందనీయం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్ఐ ఆర్. అశోక్ ఆత్మీయ పదవీ విరమణ కార్యక్రమాన్ని  శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ... అశోక్ మూడు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. 1989లో కానిస్టేబుల్‌గా చేరి, కష్టపడి పనిచేస్తూ 2018లో ఎ.ఎస్.ఐగా పదోన్నతి పొందడం ఆయన సేవా నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అశోక్ ని శాలువా, జ్ఞాపిక, బహుమతితో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, సి.సి. కిరణ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.