27 June, 2026 | 9:26 AM

ఉపాధి హామీ మహిళా కూలీలకు ఆత్మీయ భరోసా తక్షణమే అందించాలి

14-06-2025 12:46 AM

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు.రణపంగ కృష్ణ 

పెన్ పహాడ్: జాతీయ ఉపాధి పథకం లో భాగంగా పని చేస్తున్న మహిళా కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆత్మీయ భరోసా ద్వారా రూ.12,000 అందించే ఆదుకోవాలని   సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణప్పంగ కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.  శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామంలో ఉపాధి హామీ కూలీల లతో   కలసి ఉపాధి హామీ పనులను పరిశీలించి మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి హామీ మహిళ  కూలీలకు . సంవత్సరానికి 12,000 రూపాయలు  ఆత్మీయ భరోసా కింద ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి 12 వేల రూపాయలతో పాటు జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అలాగే ఇంటి స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇట్టి స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని దినాలు సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని కొలతలు లేకుండా రోజుకు 700 రూపాయలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మెట్లు రణపంగ శ్రీకాంత్ సుకన్య, రజిని, సుజాత, సైదమ్మ, గురమ్మ, శాంత, చిట్టి, పద్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.