జిల్లాలో సంపూర్ణ సాంకేతిక నెట్వర్క్
22-06-2026 05:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంపూర్ణ సాంకేతిక నెట్వర్క్ అందుబాటు లో తెచ్చేందుకు చర్యలు ప్రారంభించిన టు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన మండలాలైన కుబీర్ కుంటాల పెంబి దస్తురాబాద్ కడెం మామడ సారంగాపూర్ తదితర మండలంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామాలను గుర్తించి అక్కడ సంబంధిత కంపెనీలతో సెల్ఫోన్ టవర్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా గుర్తించి ఆ సేవలను ప్రతి పౌరుడికి అందించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని దీనికి కావలసిన అనుమతులను క్లియర్ చేస్తూ సెల్ఫోన్ టవర్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.






