ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించి డంపింగ్ యార్డ్ ను తొలగించండి
ప్రజాభవన్లో వినతి పత్రం సమర్పించనున్న డంపింగ్ వ్యతిరేక పోరాట కమిటీ
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజల ప్రాణాలకు మప్పుగా పరిణమించిన డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పిస్తామని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ ఇఫ్టు షేక్షావలి అధ్యక్షతన సోమవారం కమిటీ కో కన్వీనర్స్ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ జవహర్ నగర్ పరిధిలోగల ప్రజలకు చుట్టుపక్క ఉన్న షామీర్పేట యాప్రాల్ కీసర చీర్యాల్ సాకేత్ రాంపల్లి నాగారం ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు డంపింగ్ యార్డ్ వలన ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగానే మంగళవారం రోజున ప్రజాభవన్లో వినతి పత్రం సమర్పణ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని
ఈ కార్యక్రమంలో భాగంగా జులై 1వ తేదీ నుండి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జులై 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు జవహర్ నగర్ లోని సుమారు 100 బస్తీలలో ప్రజలను చైతన్యపరిచే పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్ పోరాట కమిటీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడానికి పూనుకున్నామని తెలిపారు. ఈ కమిటీలో భాగస్వామ్య సంస్థలకు చెందిన నేతల సూచనల మేరకు కొద్ది మార్పు చేర్పులతో సమావేశంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.






