22 June, 2026 | 6:56 PM

కడం, పెంబి అటవీ ప్రాంతంలో భారీ వర్షం

22-06-2026 05:40 PM

ఈదురు గాలులకు కూలిన చెట్లు, తెగిన విద్యుత్తు లైన్లు

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం, పెంబి, మండలాల అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం రెండున్నరకు భారీ వర్షం కురవడంతో అటవీ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు 33/11 కేవీ విద్యుత్ సరఫరా లైన్లపై పడడంతో తీగలు తెగిపడిపోయాయి. దీంతో రెండు మండలాలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ఖానాపూర్ మంచిర్యాల రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అటవీ శాఖ సిబ్బంది స్పందించి చెట్లను తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. విద్యుత్ శాఖ సిబ్బంది తమ సిబ్బందితో చెట్లను కొట్టివేసి విద్యుత్ను పునరుద్ధరించే పనులు చేపట్టారు.